రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి

రైతాంగం సుభిక్షంగా ఉండాలి
తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రార్థించిన మాజీ మంత్రి దేవినేని
సుప్రభాత సేవలో స్వామికి పూజలు

ఆంధ్రప్రభ విజయవాడ రూరల్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర టెంపుల్ లో నిర్వహించిన శ్రీవారి సుప్రభాత సేవలో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రీవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రైతన్నలు పండించే పంటలు సమృద్ధిగా పండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సంతోషంగా ఉండాలని దేవినేని ఉమా ఆకాంక్షించారు.

Leave a Reply