ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత
ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం తాత కుంట్ల గ్రామపంచాయతీ శివారు గౌరవం పాలెం ఎంపీపీ ఎస్ హేబిటేషన్లో సోమవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి ఉదయం ఆరు గంటలకి బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికార కె శంకరరావు(1) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.
బడి పిలుస్తోంది కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగిందని అందులో భాగంగా మండల పరిధి తాత కుంట్ల గ్రామ శివారు గౌరవం పాలెం గ్రామంలో ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థిని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సౌకర్యాల గురించి తెలియజేసి విద్యార్థులను రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులకు పలక, బలపం, నోటు పుస్తకాలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడంతోపాటు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తల్లికి వందనం, విద్యార్థి మిత్ర కిడ్స్, మధ్యాహ్న భోజన పథకం డిజిటల్ విద్యా బోధన దూర ప్రాంతం నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్స్ అలవెన్స్, వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ వారు అమలు చేయడం జరుగుతుందన్నారు.
కావున విద్యార్థులు ప్రభుత్వ వారు అందించే విద్యతోపాటు వారు ఇచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి కె శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ముస్తాక్, రాజేంద్ర, ఊమర్ ఖాన్, ఎస్ఎంసి చైర్మన్ సిహెచ్ వెంకటేష్, ఎస్ఎంసి ఎక్స్ అఫీషియో నంబర్ కోలేటి రంగారావు, గ్రామ పెద్దలు పై దుల్ల, షరీఫ్, వార్డ్ మెంబర్ సుభాని, తదితరులు పాల్గొన్నారు.
