రోడ్డు ప్రమాదంలో పాత సంగమేశ్వరం వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో పాత సంగమేశ్వరం వాసి మృతి

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: కోడూరు–అవనిగడ్డ ప్రధాన రహదారిలోని వి కొత్తపాలెం–జయపురం మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుడిని నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామానికి చెందిన కోలా ఏసుబాబుగా గుర్తించారు. అవనిగడ్డ నుంచి కోడూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఢీకొట్టిన వాహనం ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలంలో ఆ వాహనానికి సంబంధించిన చెప్పులు లభించినట్లు కూడా పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Leave a Reply