ప్రజా దర్బార్ అర్జీలను వేగంగా పరిష్కరించాలి

ప్రజా దర్బార్ అర్జీలను వేగంగా పరిష్కరించాలి

అవనిగడ్డ – ఆంధ్రప్రభ

ప్రజా దర్బార్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం అవనిగడ్డ రెవిన్యూ హాలులో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే అర్జీలను పరిశీలించి అధికారులకు పరిష్కారాలు సూచించారు. త్రాగునీటి సరఫరాపై గ్రామాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో త్రాగునీటి ఇబ్బంది రాకుండా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలు తొలగించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు ఆదేశించారు.