సీఎఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

తిరువూరు, ఆధ్రప్రభ : స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గురువారం తిరువూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కపాలెంలో ముత్యాలమ్మ దేవస్థానంలో ఇటీవల బొడ్డురాయి ప్రతిష్ట జరగగా, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పర్వతనేని జగన్, సభ్యులు నాగిరెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దినేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రావూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని దోమతోటి వెంకట కృష్ణకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.46,084 చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. గ్రామ సచివాలయం సందర్శించిన ఎమ్మెల్యే స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.