వైభవంగా బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి

వైభవంగా బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి

కృష్ణానదిలో అవభృత స్నానం..
వసంతోత్సవం తో ముగిసిన చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు

ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆలయంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం ధాన్య కొట్నోత్సవం, వసంతోత్సవం భక్తి వాతావరణంలో నిర్వహించారు. తర్వాత అవభృత స్నానం కోసం గంగా, పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారిని అర్చకులు, వేద పండితులు ఆలయ స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఊరేగింపుగా కృష్ణానదికి తీసుకువెళ్లారు. పుణ్యనది కృష్ణాలో స్వామివారికి అవభృత స్నానకార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు జి. సరోజినీ దేవి, పి. రాఘవరాజు, ఎం. కళావతి, ఎస్. సరిత, జీవి నాగేశ్వరరావు తదితరులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Leave a Reply