ప్రయివేటు పాఠశాలలో విద్యార్థుల చేర్పించవద్దు.
ప్రయివేటు పాఠశాలలో విద్యార్థుల చేర్పించవద్దు.
బోధన్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిo చాలని బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్పంచులకు పాఠశాల లు, ప్రభుత్వం కలిపిస్తున్న సౌకర్యాల పై అవగాహన కలిపించారు. ఈ సందర్బంగా డి ఎల్ పి ఓ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనిసూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో కూడిన విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే విధంగా సర్పంచులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నాగయ్య, రాణి మంజుష,ఆంజనేయులు ఎంపీడీవోలు కిషోర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
