సమ్మెలో కార్మికులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..

సమ్మెలో కార్మికులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి బాబా నీటి పథకం కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం తీవ్ర నీటి కొరత సమస్య ఉంది ఇది ప్రజలకు సమస్య అని తెలుసు. కానీ మే 5వ నుంచి తప్పనిసరి పరిస్థితులలో కార్మికుల సమస్యల కోసం సమ్మెలోకి వెళ్లినట్లు కార్మికులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ నీటి పథకం గతంలో అనేక గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని అందిస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. 1997 నుంచి 2019 వరకు ఈ పథకం నిరంతరంగా కొనసాగింది. అనంతరం 2019 తర్వాత ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిర్వహణ చేపట్టింది.

అయితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి పథకం నిర్వహణకు సుమారు రూ.35 కోట్ల అవసరం ఉండగా, కేవలం రూ.13.7 కోట్లే కేటాయించబడినట్లు సమాచారం. ప్రతి నెల సుమారు రూ.5 కోట్ల వ్యయం ఉండటంతో మొత్తం ఖర్చు రూ.20 కోట్లకు చేరుకుంటోంది. 2026–27 సంవత్సరానికి అవసరమైన నిధులపై స్పష్టత లేకపోవడం పథకం నిలిపివేతకు దారితీసింది. ఈ పథకం ద్వారా తాగునీరు, పట్టణాలు గ్రామాలకు నీటి సరఫరా అందించబడుతోంది. పథకం నిలిచిపోవడంతో ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పథకాన్ని కొనసాగించేందుకు తగిన నిధులు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. కార్యక్రమంలో మధు, ఆదినారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply