భీమ్‌గల్ లో బీజేపీ నాయకుల సంబురాలు..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా సోమవారం భీమ్‌గల్ మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సుమంగళి చౌరస్తా సమీపంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాలను బీజేపీ పార్టీ విజయం సాధించడంతో కైవసం చేసుకోవడం భారతీయ జనతాపాటికి శుభ పరిణామం అని నాయకులు తెలిపారు. రాబోయే 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఈ మూడు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంతో పని చేశారని నాయకులు అన్నారు. పీఎం నరేంద్ర మోడీ యొక్క నాయకత్వన అమిత్ షా యొక్క మార్గదర్శన ఈ దేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని కొనియాడారు.ఈ యొక్క విజయం కార్యకర్తల విజయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు సంధ్యారాజు, యోగేశ్వర్ నర్సయ్య,హరిప్రసాద్, ప్రమోద్, దయా ప్రవీణ్, యోగిని శీను,గంగాధర్ గౌడ్, నర్సయ్య, నవీన్ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
