పించన్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే..
పించన్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే..
ప్రజల అభిమానం చూరగొన్న టీడీపీ ప్రభుత్వం.
లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్లు అందజేత.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఇచ్చిన హామీలను తూచతప్పకుండా అమలు చేయడంతో ప్రజల అభిమానాన్ని టీడీపీ ప్రభుత్వం చూరగొన్నదని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.62వ డివిజన్ పాయకాపురం రైతు మార్కెట్ వెనుక భగీరథ కాలనీ ప్రాంతంలో, 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ సమీపంలోని అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్రభుత్వం ప్రతినెలా అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు శుక్రవారం వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులకు అందజేశారు.ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచే పేద ప్రజలకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వం వారి పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తోందన్నారు,
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశా నిర్దేశం లభించిందని తెలిపారు. తాను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిరియ జగదాంబ సోమేశ్వరరావు,క్లస్టర్ ఇంచార్జి బత్తుల కొండా కామేశ్వరి,ఇంఛార్జి పైడి శ్రీను తులసి, డివిజన్ అధ్యక్షుడు జలకం రాజా, కూర్మాపు దుర్గారావు,క్లస్టర్ ఇంచార్జి సుర్విపల్లి అమర్నాధ్,ప్రధాన కార్యదర్శులు మరియా బాబు,మల్లంపాటి రవికుమార్,దొండపాటి సుల్తానా,రౌతు మంగరాజు,సి.డి.ఓ జగదీశ్వరి,కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
