కష్టించే వారికే పార్టీ పదవులు

కష్టించే వారికే పార్టీ పదవులు

టీడీపీ అర్బన్ కార్య నిర్వాహక కార్యదర్శి గౌసియా
జన్మదిన వేడుకలు ..
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ : కష్టించే వారికే పార్టీ పదవులు కట్టబెడతామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అర్బన్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్. కె. గౌసియా జన్మదిన వేడుకలు మంగళవారం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా, గౌసియాతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.అనంతరం పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు.

ఈసందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి గెలుపుకు కృషి చేసిన ప్రతి యొక్క కార్యకర్తకు పార్టీ పదవులు ఇచ్చి ప్రోత్సాహించడం జరిగిందని అన్నారు.ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎమ్మెల్యే బొండా ఉమా గత ఎన్నికల్లో చేసిన కృషిని గుర్తించి, పార్టీ కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించారని గౌసియా అన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే బొండా ఉమా గెలుపుకు విశేష కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రాజానా బంగారు నాయుడు,లబ్బ వైకుంటం,క్లస్టర్ ఇంచార్జి దాసరి కనకారావు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఎస్. కె గౌస్ బాషా, ఎం. డి. ఆఫ్రోజ్,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply