లబ్దిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా..

లబ్దిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా..

జిల్లాలో మే మాసంలో 2,35,260 మందికి రూ.103.90 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, ఆంధ్రప్రభ : లబ్దిదారుల ముంగిటకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందచేస్తూ, మే మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 35 వేల 260 మంది లబ్దిదారులకు రూ.103.90 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.

శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా స్థానిక లేబర్ కాలనీ లో ఎద్దుల లక్ష్మమ్మ, సిరివెళ్ల సుబ్బమ్మ, అయ్య పోగు మాదన్న లకు వృద్ధాప్య పెన్షన్, కృష్ణ కు వైకల్య పెన్షన్, చింతలపల్లి పరమేశ్వరి, గొల్ల లక్ష్మి లకు వితంతువు పెన్షన్ లను కలెక్టర్ అందజేశారు…

ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారులకు పెన్షన్ లను పంపిణీ చేస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడుతూ ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందిస్తున్నారా, అని కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రమణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply