Srisailam | విహారయాత్రలోవిషాధం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న శ్రీశైలం పాతాళ గంగలో స్నానానికి దిగి ఓ యువ‌కుడు మరణించిన ఘటన చోటుచేసుకుంది.

మృతుడు క‌రీంన‌గ‌ర్ కు చెందిన సాయి తేజ‌(18)గా గుర్తించారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదు ఉప్పుగూడా బాయ్స్ హాస్టల్ లో ఉంటూ కులీకుతుబ్ షా కళాశాలలో పాలిటెక్నీక్ డిప్లొమా చదువుతున్న సాయి తేజ…. ఐదుగురు మిత్రులతో కలసి విహార యాత్రలో భాగంగా గురువారం శ్రీశైలం చేరుకుని పాతాళ గంగలో స్నానామాచరించడానికి నదిలో దిగి ప్రమాదవశాత్తు మృతిచెందాడు.

Leave a Reply