మైలవరం నియోజకవర్గంలో రూ.17.28 కోట్ల పింఛన్లు

మైలవరం నియోజకవర్గంలో రూ.17.28 కోట్ల పింఛన్లు
లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 40,022 మందికి రూ.17.28 కోట్ల పింఛన్ సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను ఎమ్మెల్యే వసంత కూటమి నేతలు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. రెడ్డిగూడెం మండలంలో 7,061 మందికి రూ.3.03 కోట్లు, మైలవరం మండలంలో 9,387 మందికి రూ.4.06 కోట్లు, విజయవాడ రూరల్ మండలంలో 5,310 మందికి రూ.2.32 కోట్లు, జి.కొండూరు మండలంలో 8,405 మందికి రూ.3.59 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 4,681 మందికి రూ.2.01 కోట్లు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 5,178 మందికి రూ.2.27 కోట్లు మంజూరయ్యాయి.
ఇవికాక స్పౌజ్ కేటగిరీ కింద మరి 50 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు పింఛన్ల పంపిణీ నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
