పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
కోడూరు – ఆంధ్రప్రభ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోడూరు ప్రధాన సెంటర్ లోని ఆంజనేయ స్వామి గుడిలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల మధ్యలోకి రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోట రాంబాబు, కడవకోల్లు శ్రీనివాసరావు, బచ్చు వెంకటేష్ తో పాటు, బడే భవన్నారాయణ, పూతబోయిన సీతారత్న సాయిబాబు, బచ్చు పూర్ణచంద్రరావు, పెద్ది బాబురావు, చదువు కిరణ్ బాబు,పరిశే వెంకటేశ్వరావు, మల్లా వెంకటేశ్వరరావు, కన్న లక్ష్మణరావు, భూపతి శ్రీనివాసరావు, బెల్లంకొండ సుబ్బయ్య, పాలంకి శ్రీనివాసరావు, బడే కృష్ణ, కోట మురళి, కాగిత నాగేశ్వరావు, కాగిత రామారావు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు..


