అనాధల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు

అనాధల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు
- శ్రీ వెంకటేశ్వర బాల మందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం..
- ఉచిత విద్య వసతి భవిష్యత్తుకు బలమైన పునాది..
- ఉన్నత ఉద్యోగాలు స్థిరపడే అవకాశం…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తల్లిదండ్రులు లేని హిందూ మతానికి చెందిన అనాధ పిల్లలు ప్రాథమిక తరగతిలోనూ ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రాథమిక విద్యా స్థాయి,ఆరు నుంచి 10 తరగతిలో ఉన్నత విద్యా స్థాయిలో పాఠశాలలో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర బాల మందిరం నిర్వాహకులు నోటిఫికేషన్ జారీ చేశారు. దేశంలో అనేక దాతృత్వ సంస్థలు ఉన్నప్పటికీ అనాధ పిల్లల విద్య, సంరక్షణ విషయంలో విశ్వసనీయత, స్థిరత్వం, సమగ్ర అభివృద్ధి, అనే మూడు అంశాలను ఒకే వేదికలో అందించే సంస్థలలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఈ సంస్థ నిర్వహిస్తున్న ఎస్వీ బాల మందిరం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేస్తూ దేవస్థానం బోర్డు నిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వి.బాల మందిరం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక విద్యాసంరక్షణ కేంద్రం. ఇది కేవలం పాఠశాల కాదు ఇది అనాధ మరియు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఆహారం నివాసం విద్య విలువలు సంస్కృతి అన్ని కలిపి అందించే సమగ్ర అభివృద్ధి కేంద్రంగా రూపొందించారు. ఇక్కడ చేరిన పిల్లలు చిన్న వయసు నుంచే క్రమశిక్షణ సంస్కారం విద్యను గురువులు నేర్పుతారు.
ఎస్ వి.బాల మందిర్ లో చేరటానికి అర్హతలు…
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉండే ఈ చిన్నారుల వాళ్ల మందిరంలో చేరటానికి హిందూ మతానికి చెందిన పిల్లలు అర్హులు. ఏప్రిల్ 27 తేదీ నాటికి ఐదు నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు వాళ్ల మందిరంలో చేరటానికి అర్హులు. అనాధ పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. తల్లిదండ్రులు మరణ ధీకరణ పత్రం ఉంటేనే అందజేయాలి ఆదాయ దృవీకరణ పత్రం జనన ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం ఉంటే మందిరంలో ఇవ్వాలి.
ఎంపిక విధానం…
ఈ బాల మందిరంలో చేరటానికి ఏ క్యాటగిరి బి కేటగిరీ అనే రెండు విధానాల ద్వారా ఎంపిక చేస్తారు. ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన పిల్లలకు మొదటి క్యాటగిరిగాను 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు రెండో కేటగిరీగాను ఎంపిక చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు లేని అనాధలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒక తల్లి లేదా తండ్రి దీని పిల్లలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంరక్షణకుల ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ఉంటాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు గోవిందరాజు స్వామి ఆలయం పరిధిలోని పాఠశాలలో ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ చదివి విద్యార్థులకు ఎస్వి జూనియర్ కళాశాలలోనూ ఎస్ వి డబ్ల్యూ జూనియర్ కాలేజీ లోనూ అడ్మిషన్లు ఇస్తామన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో చదివే అవకాశం ఉంటుంది.
ఉచితంగా ఈ సౌకర్యాలు లభిస్తాయి..
తిరుపతిలోని ఎస్పీ బాల మందిరంలోనూ కళాశాలలోనూ అర్హతలతో చేరిన విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు రోజువారి పాలు మధ్యాహ్న భోజనం టిఫిన్ మరియు స్నాక్స్ రాత్రి భోజనం పాఠ్యపుస్తకాలు దుస్తులు యూనిఫాంలో హాస్టల్ వసతి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను పూర్తిగా టిడిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. విద్యతో పాటు విలువలు సంస్కారం కూడా ముఖ్యమైన దృష్టితో విద్యార్థులకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పిస్తారు.
ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థులు…
శ్రీ వెంకటేశ్వర బాల మందిరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఐటీ రంగంలోనూ మెడికల్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొంది రాణిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిన్నారులకు విద్యాబోధన చేయటం జరుగుతుందన్నారు. అనాధ పిల్లలకి జీవనాడి ఎస్పీ బాల మందిరం అనే నినాదంతో ఈ విద్యా సంస్థ నడుస్తుందన్నా రు.ఎస్వి బాలసుందరం వసతి విద్య మందిరంలో ప్రవేశాల కోసం మే 16వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.
తిరుపతిలో బాల మందిరంలో లభించే ఫారం లేదా తెల్ల కాగితం పై వివరాలు రాసి సమర్పించవచ్చు. స్వయంగా లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. దరఖాస్తులను సహాయ కార్య నిర్మాణాధికారి, శ్రీ వెంకటేశ్వర బాల మందిరం, టీడీటీ, భవాని నగర్, తిరుపతి.. 517501 కి దరఖాస్తులు పంపాలి. అర్హులు గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 0877-2264613 నెంబర్ కు కాల్ చేసి కనుక్కోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
