కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ పి జి ఆర్ ఎస్ స్వీకరణ

కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ పి జి ఆర్ ఎస్ స్వీకరణ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామం లోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమకూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగిందని, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply