పార్టీ బలోపేతానికి సరి కొత్త అడుగు

పార్టీ బలోపేతానికి సరి కొత్త అడుగు
-వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీకి జవసత్వాలు
-లోకేష్ కు ప్రత్యేక శుభాకాంక్షలు
-కేడీసీసీ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం
విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక కావడం పట్ల పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలతో నిరంతరం మమేకమవుతూ పార్టీని బలోపేతం చేయడంలో లోకేష్ చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యకర్తల హక్కులు, సంక్షేమం కోసం ఆయన చూపుతున్న పట్టుదలకే ఈ పదవి న్యాయం చేసిందన్నారు.
లోకేష్ దూరదృష్టి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తివంతంగా ఎదిగి ప్రజలకు సేవ చేసే దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, స్పష్టమైన దిశను అందిస్తుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్రానికి సమర్థ నాయకత్వం వహించే స్థాయికి లోకేష్ ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రఘురామ్ తెలిపారు.
