డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత..

డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత..

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుకున్నారు. 18 గ్రాముల MDMA డ్రగ్స్, 2 కేజీల గంజాయిని రాజేంద్రనగర్ ఎస్ఓటి బృందం స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఓటీ తనిఖీ చేసింది. బెంగుళూరు జాతీయ రహదారి పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సును అడ్డగించి తనిఖీలు చేయగా లగేజ్ బ్యాగ్ లో MDMA డ్రగ్ తో పాటు రెండు కేజీల గంజాయి గుర్తించారు. సంతోష్, గాంధీ సందీప్, శివలను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply