అంబేద్కర్ ఆశయాల దిశగా జర్నలిస్టుల సంకల్పం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అచ్చంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ… అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే గొప్ప పునాది అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని గుర్తు చేశారు.
పాత్రికేయ వృత్తి ప్రజాస్వామ్యానికి నాల్గో స్థంభమని, అంబేద్కర్ చూపిన మార్గంలో న్యాయం, నిజాయితీ, సమానత్వం కోసం పనిచేయడం ప్రతి జర్నలిస్ట్ బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు , యువ పాత్రికేయులు పాల్గొన్నారు.
