ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే…
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే…
అమరావతి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన అమరావతిలోని ప్రభుత్వ పాఠశాలను సోమవారంపెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీచేశారు.విద్యార్థులతో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్య,ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల అమలు విధానాన్ని అడిగితెలుసుకున్నారు. విద్యార్థులనడవడికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలన్న ఎమ్మెల్యే కోరారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు షేక్ జానీ, మండల టీడీపీ అధ్యక్షులు మంచినేని రాజా, టీడీపీ నాయకులు దండా నాగేంద్ర, గుడిసె కిరణ్ కుమార్, నల్లిబోయిన రాజశేఖర్ యాదవ్, ఆలా వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
