ఆలయ శంఖుస్థాపన..

ఆలయ శంఖుస్థాపన..

పెడన, ఆంధ్రప్రభ : నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి షిర్డీ సాయి ఆలయ శంఖుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు. కోరుమిల్లి మధుసూదనరావు, మాధవీలత దంపతులచే శంఖుస్థాపన వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన నాయి బ్రాహ్మణ సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహణలో ఎంతో ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కోరుమిల్లి వెంకటస్వామి,వేములవాడ జనార్ధన్, కల్వకుంట్ల నూకల బాబు, అవనిగడ్డ వెంకటేశ్వరావు, దాలిపర్తి లోకేష్, కోరుమిల్లి వినయబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply