america | 5,200 ఏళ్లనాటి పడవలు గుర్తింపు.. ఆదిమానవుల జీవన విధానంపై కొత్త వెలుగు

america | ఆదిమానవుల జీవన విధానానికి కీలక ఆధారాలు
మెన్‌డోటా సరస్సులో 16 పురాతన పడవల ఆవిష్కరణ
గ్రేట్ పిరమిడ్లకన్నా పురాతనమైన పడవలు
కార్బన్ డేటింగ్‌లో 5,200 ఏళ్ల వయస్సు నిర్ధారణ
ఓక్, రెడ్ చెట్లతో పడవల నిర్మాణం
చేపల వేట, సరస్సు ప్రయాణాలపై ఆధారాలు
సహజ వనరుల వినియోగంలో ఆదిమానవుల తెలివితేటలు
న్యూసీవీక్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాలు
america ఔను.. నిజమే అమెరికాలోని ఓ సరస్సులో 5,200 ఏళ్ల నాటి పడవలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆది మానవుడి జీవన విధానానికి సంబంధించిన పరిశోధన లకు ఈ పడవ ఎంతో ఉపకరిస్తుందని పరిశోధకులు భావి స్తున్నారు. ఆదిమానవుల జీవన విధానంలో క్రమంగా వచ్చిన మార్పులపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నా యి. దెబ్బతిన్న చెట్లను పడవల తయారీకి ఆదిమానవులు ఉపయోగించి ఉండవచ్చని ఇంతవరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే, తాజాగా దొరికిన వేల ఏళ్ల నాటి పడవ వల్ల వారి పరిశోధనలకు కొత్త ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

america | సుమేరియన్ నాగరికతకన్నా ముందరివే
ఉత్తర అమెరికాలోని మెన్ టా సరస్సు అడుగు భాగాన చెక్కలతో చేసిన చిన్నపాటి పడవలను గుర్తించా రు. అలనాటి మానవులు.. వేల ఏళ్ల క్రితమే ఇలాంటి పడ వల్లో జీవించారని, పెద్దపెద్ద సరస్సుల్లో ప్రయాణించారని శాస్త్రవేత్తలు దీని ఆధారంగా చెబుతున్నారు. విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం.. మన డోటా సరస్సు అడుగున 16 చిన్నపాటి పడవలను గుర్తిం చారు. అవన్నీ డొల్లకర్రలతో (లోపల ఖాళీగా ఉన్న వృక్షాల కాండాలు) చేసినవే. ఇవన్నీ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా (ఈజిప్టు) కాలానికన్నా… సుమేరియన్ నాగరికతకన్నా ముందరివేనని నిర్ధారించారు. ఇప్పటివరకు గుర్తించిన అతి పురాతన పడవలు ఇవే. గతంలో, 2021లో 1200 ఏళ్లనాటి ఒక పడవను గుర్తించారు. అలాగే, 2022లో 3వేల ఏళ్లనాటి పడవను గుర్తించారు.మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
