Australia | మహాత్ముని విగ్రహం చోరీ…

Australia | మహాత్ముని విగ్రహం చోరీ…
Australia | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్ నగరం రౌవిల్లేలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం చోరీకి గురైంది. ఆస్ట్రేలియాలోని భారత సామాజిక కేంద్రంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారులతో గట్టిగా మాట్లాడాం, గల్లంతైన విగ్రహాన్ని వెంటనే కనుగొనాలని, బాధ్యులను శిక్షించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
దాదాపు 420 కేజీల బరువున్న ఈ విగ్రహం దొంగతనానికి గురైనట్టు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. దుండగులు విగ్రహాన్ని పాదాల వద్ద తెగ్గోసి తీసుకుపోయారని వివరించింది. భారత సాంస్కృతిక సంబంధాల మండలి అందించిన మహాత్ముని విగ్రహాన్ని 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు. భారత్, ఆస్ట్రేలియా మైత్రికి గుర్తుగా మహ్మాత గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

click here to read more : Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత…
