అన్యాక్రాంతమైన ఆలయ భూమి వెలికితీత

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : అన్యాక్రాంతమైన ఆలయ భూమిని వెలికి తీసి హద్దు రాళ్లను ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత తెలిపారు. మంగళవారం ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దేవాదాయ శాఖకు చెందిన ఆలయ భూములను డిజిటల్ సర్వేలో భాగంగా మండలంలోని శ్రీ లక్ష్మి నృరసింహ స్వామి దేవస్థానంకి చెందిన 19 ఎకరాల 23 గుంటల భూమిని డిజిటల్ సర్వే చేసి 2 ఎకరాల 10 గుంటలను వెలికి తీసి హద్దురాళ్ళు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.

అలాగే మండలంలోని జయపురం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామస్వామి వేణుగోపాలస్వామికి చెందిన 4ఎకరాల 15 గుంటల భూమిని సర్వే చేయగా 10 గంటల భూమిని వెలికి తీసి హద్దులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.దేవాలయ భూముల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను ఎవరైనా తొలగిస్తే దేవాదాయ చట్ట ప్రకారం 30/87 కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యోగానంద సేవా సమితి సభ్యులు బండి రమేష్,అలువాల నవీన్,గ్రామస్తులు మంద వీరన్న,సుంకరి చంద్రం,సుంకరి ఉప్పలయ్య దేవాదాయశాఖ సర్వేయర్ పసునూరి అనిల్,జూనియర్ అసిస్టెంట్ మార్క శేఖర్ సిబ్బంది రాములు,కాలు,పవన్ తదితరులు ఉన్నారు.

Leave a Reply