WGL | వైద్యం వికటించి బాలుడు మృతి..

తొర్రూరు టౌన్, (ఆంధ్రప్రభ) : వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటన పట్టణ కేంద్రంలోని బాలాజీ నర్సింగ్‌హోమ్‌ (సరస్వతి ఆసుపత్రి)లో బుధవారం చోటుచేసుకుంది.

మండలంలోని కంఠయపాలెం గ్రామానికి చెందిన దాసరోజు నాగరాణి కుమారుడు దాసరోజు సిద్ధార్థ్ (13) రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొర్రూరులోని బాలాజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన డాక్టర్ సిద్ధార్థ్ కు ఇంజక్షన్ ఇచ్చారు.. అయితే ఇంజక్షన్ వేసిన 10 నిమిషాలకే శ్వాస ఆడట్లేదంటూ కుటుంబ సభ్యుల ముందే విలవిలలాడుతూ సిద్ధార్థ్ మృతి చెందాడు.

పెద్దలకు వేసే ఇంజక్షన్.. త‌మ బిడ్డ‌కు వేయ‌డం వలనే క్షణాల్లో మృతి చెందడాడని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సిద్ధార్థ్‌కు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply