Adivi sesh | ప్రయోగం చేయబోతున్నారా…?

Adivi sesh | ప్రయోగం చేయబోతున్నారా…?
క్షణం సినిమాతో టర్నింగ్ పాయింట్
వరుస విజయాలతో క్రేజ్ పెంచుకున్న శేష్
దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ప్రయాణం
శేష్ కోసం సిద్ధమైన కొత్త కథ
ప్రయోగాత్మక సినిమాతో రాబోతున్న శేష్
Adivi sesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శేష్.. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ స్టోరీలతో కాకుండా డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నాడు. తనకంటూ ఓ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. శేష్ హీరో (Sesh Hero) మాత్రమే కాదు.. స్టోరీ రైటర్ కూడా. తన సినిమాలకు కథలు కూడా తనే రాసేసుకుంటాడు. ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీకి ఓకే చెప్పాడని.. ఇది ఒక ప్రయోగం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. శేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?
Adivi sesh | టర్నింగ్ పాయింట్ క్షణం..
అడివి శేష్.. కర్మ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, బాహబలి చిత్రాల్లో నటించాడు. అయితే.. క్షణం సినిమాతో హీరోగా కమర్షియల్ సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది శేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్పచు. ఆతర్వాత అమీ తుమీ గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాతో (Movies) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సమ్మర్ లో డెకాయిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు శేష్.

Adivi sesh | విమర్శకుల ప్రశంసలు..
ఇదిలా ఉంటే.. అడివి శేష్.. యాక్టర్ కమ్ డైరెక్టర్ (Director) రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథకు ఓకే చెప్పారట. అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ ఆతర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఆతర్వాత కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించాడు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో రాహుల్ రవీంద్రన్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆతర్వాత యాక్టింగ్ నుంచి ఫోకస్ డైరెక్షన్ వైపు షిప్ట్ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Adivi sesh | శేష్ ప్రయోగాత్మక చిత్రం..
ఆతర్వాత కింగ్ నాగార్జునతో మన్మథుడు 2 అనే సినిమా చేసినా అది వర్కవుట్ కాలేదు. ఆతర్వాత ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేశాడు. నేషనల్ క్రష్ రష్మికతో (Rashmika) చేసిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత రాహుల్ రెండు కథలు రెడీ చేసాడట. అందులో ఒక కథను అడివి శేష్ కి చెబితే నచ్చిందని ఓకే చెప్పాడట. అయితే.. తను ప్రస్తుతం బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కాస్త టైమ్ పడుతుందట. ఇది ఒక ప్రయోగాత్మక సినిమా అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శేష్ తో సినిమా కంటే ముందు దీక్షిత్ శెట్టి హీరోగా ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.

