‘బాయ్ కాట్ లైలా’ వివాదంపై నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ.. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదు. రాజకీయాల గురించి వేరే వేదికపై మాట్లాడుకుందాం. సినిమాని చంపకండి. సినిమాను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా.
ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకండి. లైలాను బాయ్ కాట్ చేయవద్దు. ఈ సినిమా విశ్వక్సేన్కి ఫలక్నుమాదాస్ను మించిన విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు పృథ్వీరాజ్.