Accident | మూడు వాహనాలు ఢీ – ముగ్గురు దుర్మ‌ర‌ణం

క‌డ‌ప : ఏపీలో ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనం జీపు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద కడప నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనాన్ని అతివేగంగా వచ్చిన జీపు ఢీ కొట్టింది. దీంతో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బొలేరోలో ఉన్న డ్రైవర్‌ , కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply