Accident | యువకుడు మృతి..

Accident | యువకుడు మృతి..

Accident, గంగవరం, ఆంధ్రప్రభ : గంగవరం (Gangavaram) మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పసుపత్తూరు పంచాయితీ పరిధిలో శంకర్రాయల పేటకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఎరువుల లోడుతో రామసముద్రంకు వెళ్తున్న టిప్పర్‌ను ఎదురుగా వస్తున్న మారుతి స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బంగారుపాళ్యం మండలం, ఊటవంక గ్రామానికి చెందిన గోపి (35) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటినా యువకున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం పై గంగవరం సి.ఐ.ప్రసాద్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Leave a Reply