Accident | ముత్యాలమ్మగూడెం వద్ద విషాద ఘటన

Accident | ముత్యాలమ్మగూడెం వద్ద విషాద ఘటన

Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దవూర–నాగార్జునసాగర్ మార్గంలోని ముత్యాలమ్మగూడెం సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదం తీవ్రతకు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, ఇతర సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.