త్యాగాల కుటుంబ ఆణిముత్యం రాహుల్ గాంధీ: ఎమ్మెల్యే
త్యాగాల కుటుంబ ఆణిముత్యం రాహుల్ గాంధీ: ఎమ్మెల్యే
జుక్కల్, (ఆంధ్రప్రభ): దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన ఆణిముత్యం రాహుల్ గాంధీ అని జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ సమగ్రత, సామాజిక న్యాయం, ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని అన్నారు.
రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని తోట లక్ష్మీకాంతరావు ఆకాంక్షించారు.
