సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం..

సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశ రక్షణ, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం హిందువులంతా సంఘటితం కావాలని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవా వ్రతి వాసుదేవానంద సరస్వతి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణ మైదానంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు కె.వి.బి కృష్ణారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వాసుదేవానంద సరస్వతి స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్‌ ప్రముఖ్ జిన్నా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. హిందుత్వం, ధర్మం, సామాజిక బాధ్యతల పై తన అభిప్రాయాలను వెల్లడించారు. సమాజంలో పరస్పర సహకారం, పంచభూతాల ఆరాధన, విలువలతో కూడిన జీవనం, అవసరాన్ని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ సంస్థ వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. సమాజంలో నైతిక విలువల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరి రక్షణపై త్రినిటీ విద్యార్థులు ప్రదర్శనలు చేయగా, శ్రీ భావనారుషి భజన మండలి సభ్యులచే భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, హిందూ సమ్మేళన ఉప మండల ప్రధాన కార్యదర్శి కోసనం రాంరెడ్డి, బడుగు శ్రీరాములు, హిందూ సమ్మేళన ఉప మండల కమిటీ ప్రతినిధులు పెద్ది సుధాకర్ శర్మ, కర్నాటి శ్రీనివాస్ లు, మంచికంటి భాస్కర్, బాల్యం వెంకటాచలపతి, డాక్టర్ వేముల నరసింహ, బొబ్బిళ్ళ మురళి, కర్నాటి శ్యాంప్రసాద్, అయ్యాడపు ప్రతాపరెడ్డి, ఉప్పల కృష్ణ, జక్కర్తి శేఖర్, ఆముదాల పరమేష్, ఉజ్జిని మంజుల, పట్టణ ప్రముఖులు, పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు.

Leave a Reply