విజయవాడలో సీఎం పుట్టిన రోజు వేడుకలు..

విజయవాడలో సీఎం పుట్టిన రోజు వేడుకలు..

  • అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనాల సందడి
  • పటమట అన్నా కాంటీన్ కు రానున్న సీఎం దంపతులు

విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారం, భోజనం పంపిణీ చేయడానికి రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. పటమట హైస్కూల్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద కొద్దిసేపటిలో చంద్రబాబు దంపతులు హాజరుకానున్నారు. అక్కడ ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో క్యాంటీన్ పరిసరాల్లో సందడి నెలకొంది.

పోలీస్ ల ఆంక్షలు..
ఇక సీఎం పర్యటన నేపథ్యంలో హైస్కూల్ రోడ్డులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కూడా రోడ్డుపై నిలిచే అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారని సమాచారం. సీఎం భద్రతా కారణాలే చూపిస్తూ పోలీసులు మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తమ నాయకుడిని చూసి శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ మహిళా నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply