తల్లీ, బిడ్డ క్షేమం.. కృతజ్ఞతలు తెలిపిన బంధువులు..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలానికి చెందిన ఒక గిరిజన గర్భిణీ మహిళ ఈరోజు అంబులెన్సు లోనే ప్రసవించింది. 108 అంబులెన్స్ ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్ (యు) మండలంలోని శెట్టిహడాపనూర్ గ్రామపంచాయతీ గ్రామానికి చెందిన ఆదివాసి గర్భవతి మహిళ ఆత్రం గోదావరి(Godavari River)(20)కి పురిటి నొప్పులు రావడంతో ఆశ వర్కర్ వెడ్మ రానుబాయి(Vedma Ranubai) తక్షణమే 108 అంబులెన్సు కు కాల్ చేశారు.
అంబులెన్స్‌లో 108 సిబ్బంది తక్షణమే స్పందించి హాస్పిటల్ వెళ్ళేక్రమంలో నొప్పులు అధికంగా కావడంతో అత్యవసర సమయంలో మార్గమధ్యలో 108 అంబులెన్సు లోనే అంబులెన్స్ ఉద్యోగులు ఆ మహిళకు పురుడు పోశారు. ఆదివాసి గర్భిణీ మహిళ 108లోని పండంటి అడ బిడ్డకు జన్మనిచ్చినట్టు 108 ఈఎంటి ప్రశాంతకుమార్(EMT Prashanthakumar), పైలట్ గోపినాథ్ తిలిపారు.
అనంతరం సిర్పూర్ (యు) ఆసుపత్రికి తరలంచినట్టు ఆశ వర్కర్ తెలిపారు. మీ108 సేవలు ఎప్పటికి మరువబోమని, తల్లి బిడ్డ క్షేమమే అని ఆ మహిళ బంధువులు 108 ఉద్యోగులకు, ఆశ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ మీ సేవలు మర్చిపోమని వారు పేర్కొన్నట్లు తెలిపారు.

