పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద ఉన్న పులిచింతల ప్రాజెక్టులో దుర్ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర వైపు ఉన్న ప్రాజెక్టు ప్రాంతంలో ఒక యువకుడు గల్లంతైన ఘటన ఈ రోజు వెలుగుచూసింది.
గల్లంతైన యువకుడు హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ముజాహిద్దీన్(Mujahideen)గా పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి సరదాగా పులిచింతల ప్రాజెక్టు(Pulichintala Project) విహారానికి వచ్చి కృష్ణా నదిలో స్నానం చేయడానికి దిగి గల్లంతైనట్టు సహచరులు తెలిపారు. సహచరులు అందించిన సమాచారంతో వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది(Fire crew) అధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని నదిలో కొట్టుకుపోయిన యువకుని కోసం గజ ఈతగాళ్ల(Swimmers) సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

