Breaking news | ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు

Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియా అధికారిక పర్యటనలో ఉన్న ఆయన బస చేసిన హోటల్ సమీపంలో డమాస్కస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.

మెక్రాన్ సిరియా నాయకులతో సమావేశంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ పేలుళ్లలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

పేలుళ్ల సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మెక్రాన్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

డమాస్కస్‌లో జరిగిన ఈ పేలుళ్లకు గల కారణాలు, వాటి వెనుక ఉన్న అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.