అచ్చంపేటలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, ఉద్యమ నాయకుడు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా పీడిత వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల విస్తరణ వంటి అనేక అంశాల్లో కీలక విజయాలు సాధించిందన్నారు.

భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన నిలిచి అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, కౌన్సిలర్ అంతటి శివ, శంకర్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ నాయకులు బుక్కపురం మహేష్, ఏలేటి బాలరాజ్, సౌట కాశీమ్, గద్దల కొండల్, గుద్దటి బాలరాజు, రాజగోపాల్, సౌట మహేష్, ఉదయ్, రాము, ప్రవీణ్, రాంప్రసాద్, రెబల్ అనిల్‌తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.