భూతగాదా రగడ.. రోడ్డెక్కిన కుటుంబం

భూతగాదా రగడ.. రోడ్డెక్కిన కుటుంబం

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని మహేశ్వరం గ్రామంలో భూ తగాదా నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి పై హక్కుల విషయంలో నెలకొన్న విభేదాల కారణంగా బాధితులుగా పేర్కొంటున్న కుటుంబ సభ్యులు గురువారం భూమి వద్దే ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనకు దిగారు. తమకు చెందిన భూమిని అన్యాయంగా ఆక్రమణకు గురవుతుందని, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో “మాకు న్యాయం చేయాలి”, “మా భూమిని కాపాడాలి” అనే నినాదాలతో ప్లెక్సీలు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. భూమి వివాదం పై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, సంబంధిత రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.