Veldanda | ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్రప్రభ

Veldanda | ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్రప్రభ
- ప్రజల పక్షాన నిలిచే ఏకైక పత్రిక ఆంద్రప్రభ..
- సీఐ విష్ణువర్ధన్ రెడ్డి
Veldanda |వెల్దండ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలిచే ఏకైక పత్రిక ఆంధ్రప్రభ అని వెల్దండ సీ.ఐ.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇవాళ సిఐ కార్యాలయంలో ఆంధ్రప్రభ 2026వ వార్షిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగాయ్య కన్యాకుమారి చేతులమీదుగా ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… స్వాతంత్ర్య కాలం నుంచి, నేటి వరకు ఆంధ్రప్రభ దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతి నిజాయితీలను ఎండగడుతూ, ప్రజల పక్షాన నిలిచే ఏకైక పత్రిక ఆంధ్రప్రభ అని అన్నారు.
ప్రస్తుత సమాజంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పరిష్కారం కోసం పనిచేస్తున్న ఏకైక పత్రిక ఆంధ్రప్రభ అని వారు గుర్తు చేశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో మరెన్నో మానవీయ కథనాలను, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలను ప్రచురిస్తూ అభివృద్ధి కోసం ప్రజల తరుఫున కృషి చేస్తుందన్నని పేర్కొన్నారు. మరెన్నో ప్రజా సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ విలేకరి రమేష్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
