గుండెపుడిలో ఘనంగా సీత్లా భవాని పండుగ

మరిపెడ, ఆంధ్రప్రభ: గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లా భవాని పండుగను మండలంలోని గుండెపుడి గ్రామంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని తండా నుండి డప్పు చప్పుళ్లతో యువతులు ,మహిళలు, చిన్నారులు,నృత్యాలు చేసుకుంటూ దేవతల వద్దకు వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ రవికుమార్, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు నూకల కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం ఉపేందర్ రెడ్డి, బోడపట్ల రవి, బోడపట్ల సురేందర్, బర్మాత్ నరసింహ, పంతుల్య, వీరన్న, బర్మావత్ సోమన్న, అజ్మీర రమేష్ ,నరేష్, బాలాజీ, తదితరులు ఉన్నారు.