Education | విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన గ్రామం ఘంటసాల

Education | విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన గ్రామం ఘంటసాల

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  • రూ.53 లక్షలతో మండల విద్యాశాఖాధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం

Education | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన గ్రామం ఘంటసాల అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. ఇవాళ ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని 18 సెంట్ల స్థలం(18 cents of space)లో రూ.53 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నూతన మండల విద్యాశాఖాధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజలు చేశారు.

ఈ సందర్భంగా శిలాఫలకాన్ని అధికారులు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులతో కలసి ఆయన ఆవిష్కరించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరి చేస్తున్నారని తెలిపారు. విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

నియోజకవర్గంలో 12638 మంది(12638 people)కి విద్యాసామాగ్రి కిట్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం కింద 20477 మంది విద్యార్థులకు రూ.26.62 కోట్లు నగదు జమ చేసినట్లు వివరించారు. ఇప్పటికే రెండు సార్లు మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించటం జరిగిందన్నారు.

Education |

వెనుకబడిన విద్యార్థులను మరింత ముందుకు కొనసాగించేలా తల్లిదండ్రులను సైతం అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశం ఎంతగానో దోహదపడినట్లు తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, ఈ విద్యాసంవత్సరంలో నూరుశాతం ఫలితాలు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేమూరి రజని కుమారి. ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, నియోజకవర్గ(constituency) ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు, ఎన్ఆర్ఐ మూల్పూరి వెంకట్రావు, టీడీపీ, జనసేన మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు, కోన రాజశేఖర్, టీడీపీ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, వేమూరి సాయి వెంకటరమణ, పరిశె చలపతి, ఎంపిటిసి సిద్ధినేని కుమార్ రాజా, యార్ల శ్రీకాంత్, కోలపల్లి శ్రీవర్ష, ఎంపిడివో సుబ్బారావు, తహసీల్దార్ విజయప్రసాద్, ఎంఈవోలు ఎన్.శివశంకరరావు, ఎండి.మోమిన్, ఏపీవో రాజశేఖర్, హెచ్ఎం శ్రీరంగవల్లి, వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply