Ram Charan | బాబాయ్‌ తో అబ్బాయ్‌

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

అనంతరం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్‌) కార్యక్రమానికి హాజరుకావడానికి రామ్ చరణ్ బయలుదేరారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో రామ్ చరణ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.