Suicide | నూతన సంవత్సరం రోజు కల్వకుర్తిలో దారుణం

Suicide | నూతన సంవత్సరం రోజు కల్వకుర్తిలో దారుణం

  • పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య..
  • కూతురు మృతి, కుమారుడు పరిస్థితి విషమం..
  • భర్త మరణం తట్టుకోలేక ఘాతుకం..

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నూతన సంవత్సరం రోజు దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు విశం పెట్టి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ గత నెల రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. భర్త మృతి తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న (38) ఈ రోజు మధ్యహ్నం తన ఇద్దరు పిల్లలు కూతురు మేఘన (13) కుమారుడు అశ్రీత్ రాం (15) లకు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తినేసింది. మృతురాలి తమ్ముడు ఇంటికి వచ్చి తలుపులు తీయగా మతిస్థిమితం లేని దశలో ముగ్గురు పడి ఉన్నారు. వెంటనే వారిని హుటా హుటినా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించి తల్లి, కూతురు మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రసన్న తిలక్ నగర్ లో నివాసం ఉంటున్నారు. తల్లి, కూతురు మరణం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply