ADB | సేవాలాల్ అంద‌రికీ ఆద‌ర్శం.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్

జన్నారం, ఫిబ్రవరి 15 (ఆంధ్రప్రభ): బంజారాలను సన్మార్గంలో నడపడానికి సంత్ సేవాలాల్ కృషి చేసిన ఆదర్శమూర్తి అని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బంజారాల రాష్ట్ర నాయకురాలు అజ్మీర రేఖానాయక్ అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సేవాలాల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసి జెండా ఎగరవేశారు. ఆ తర్వాత అక్కడి నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వెనుకాల గల సేవాలాల్ ఆలయం వరకు నృత్యాలు చేస్తూ బంజారా పాటలు పాడుతూ, భారీ ఊరేగింపు నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… సేవాలాల్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా, గురువుగా స్వీకరించి ఆమె ఆదేశానుసారం బంజారా సేవలో నిమగ్నమయ్యారన్నారు. సేవాలాల్ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, జంతుబలిని తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె తెలిపారు. బంజారాలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని, వెనుకబడిన బంజారాల కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. మండలంలోని కిష్టాపూర్ లో రాజునాయక్, రవినాయక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ గుప్తా నిర్వహించారు.

మండలంలోని పలు గిరిజన తండాల్లో జయంతి వేడుకలను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బంజారా రాష్ట్ర నాయకుడు రితీష్ రాథోడ్, ఉత్సవ కమిటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.నందునాయక్, దినేష్ నాయక్, నేతలు జాదవ్ సందేశ్, బి.ప్రకాష్ నాయక్, రాములునాయక్, సంతోష్ నాయక్, ప్రకాష్ బానావత్, బిమ్లాల్ నాయక్, ధర్మ నాయక్, కలిరాం, రాజారాం, సవాయిరాం, బన్సీలాల్ ఎల్.శ్రీనివాస్, పున్నం, రాజేందర్, రాములు, సంతోష్, రవీందర్, రవి,శంకర్, తిరుపతి, రాజు, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *