Municipality | మున్సిపల్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల…

Municipality | మున్సిపల్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల…

Municipality | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్ ) ఇవాళ‌ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. మున్సిపాలిటీ(Municipality) పరిధిలోని 15 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలు నోటీసు బోర్డులో పరిశీలనకు ఏర్పాటు చేశారు.

పౌరులు తమ పేరు, ఫోటో, చిరునామా, లింగం మొదలైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా తప్పులుంటే అభ్యంతరాలను ఈనెల 5 లోపు తెలపాలని వివరించారు. కార్యాలయ పనిదినాల్లో అభ్యంతరాలను తెలిపి సవరించుకునే అవకాశం ఉందన్నారు. అభ్యంతరాల అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ఓటర్లు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply