Bellampalli బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ పర్యటన
Bellampalli బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ పర్యటన
- పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చలు
బెల్లంపల్లి(Bellampalli), ఆంధ్రప్రభ:
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మంగళవారం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని వివిధ కాలనీలను సందర్శించి పార్టీ కార్యకర్తలు, నాయకులను కలిశారు.
పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతం, కాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై కార్యకర్తలతో చర్చించారు. అనంతరం భీమిని, నెన్నెల తదితర మండలాల్లో పర్యటించి పార్టీ నిర్మాణం, కార్యకలాపాలపై స్థానిక నాయకులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ సూచనల మేరకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. త్వరలో అన్ని మండలాల్లో బూత్ కమిటీలు, సెక్టార్ కమిటీలను ఏర్పాటు చేసి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.
బెల్లంపల్లిలో త్వరలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గోమాస బ్రహ్మానందం, నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
