Anna Canteen GNT : పర్వాలేదు. AndhraPrabha News
Anna Canteen GNT : పర్వాలేదు. AndhraPrabha News
రుచి..శుచి జాగ్రత్త
అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు కలెక్టర్ సూచన
మిర్చియార్డులో అకస్మిక తనిఖీ
ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ
(గుంటూరు, ఆంధ్రప్రభ)

అన్న క్యాంటీన్లో -ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన , శుభ్రం మైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ (Collector) ఏ తమీమ్ అన్సారియా(Tameem Ansaria) సూచించారు.గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలసి బుధవారం ఉదయం మిర్చి యార్డులోని (Anna Canteen GNT) అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా (Inspected) తనిఖీ చేశారు. క్యాంటీన్లో పరిసరాల (Clean) శుభ్రతను, ఉదయం సరఫరా చేస్తున్న (Tiffin) అల్పాహారంను పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే వారి సంఖ్యను, నిర్వహణ, శుభ్రత పనులు తదితర వివరాలను క్యాంటీన్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు.
Anna Canteen GNT

అల్పాహారం తీసుకుంటున్న పలువురు కార్మికులు, మిర్చి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్ లతో జిల్లా కలెక్టర్ అన్న క్యాంటీన్లో సరఫరా చేస్తున్న ఆహార నాణ్యత పై అభిప్రాయాలను తెలుసుకున్నారు, వారు సంతృప్తి వ్యక్తం (Satisfied) చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అల్పాహారంను భుజించి, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Anna Canteen GNT

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నక్యాంటీన్లలో (Quality) నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారంను అందించాలన్నారు. క్యాంటిన్లో భోజనశాల (Dining) , భోజనాలు సరఫరా చేసే ప్రాంతాలు, క్యాంటీన్ ఆవరణ నిరంతరం శుభ్రపరుస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరాతో పాటు, ఇతర మౌలిక సౌకర్యాల నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పెన్షన్ల పంపిణీ

మిర్చి యార్డ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్ (Subbareddy Nagar) లో జనవరి నెల ఎన్ టీ ఆర్ సామాజిక భద్రత పెన్షన్లు (Pensions) గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పలువురు వృద్ధులు వితంతువులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్ దారుల జీవన విధానం (Life Style), రేషన్ సరఫరా, ఆరోగ్య ( Health Condition) పరిస్థితిని, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవలు వివరాలను తెలుసుకున్నారు. పలువురు స్థానికులు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాల మంజూరు తదితర అంశాలపై తెలియజేసిన సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
Anna Canteen GNT

అనంతరం కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు ను ( Cement) పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల ల నిర్మాణం పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రెన్లపై ఉన్న పైపులైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్ఈ సుందరరామిరెడ్డి, ఎంహెచ్ఓ డా. లక్ష్మీనారాయణ, ఉపాసెల్ పిఓ సింహాచలం, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ALSO READ : Gannavaram Former MLA | వల్లభనేని వంశీ కోసం…
