Janasena | జన్మదిన వేడుకలు..
Janasena | జన్మదిన వేడుకలు..
Janasena, ఆకివీడు, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్ కనకరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా రోగులకు వృద్ధులకు పండ్లు, ఆహార పదార్థాలను అందించారు. జనసేన పార్టీలో పీఏసీ సభ్యుడుగా, ఉండి కోపరేటివ్ రూరల్ బ్యాంక్ చైర్మన్గా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీకి ఎంతో కాలంగా విశిష్ట సేవలు అందిస్తున్న కనకరాజు సూరి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నట్లుగా జనసేన పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నబాబు తెలిపారు.
పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా పార్టీ అభివృద్ధి కోసం నిత్యం పని చేసే అటువంటి నాయకుడు దొరకడం మా అదృష్టమన్నారు. అటువంటి నాయకుడు మరిన్ని పదవులు పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నట్లుగా ఆకివీడు మండలాధ్యక్షుడు బాలాజీ కోరారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉండి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నదీమ్, నిమ్మల జ్యోతి, చిరంజీవి సత్యనారాయణ, సిద్దాపురం జానీ, విశ్వేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, భరత్ తదితరులు పాల్గొన్నారు.
