Ntr bharosa | ఇంటింటికీ వెళ్లి..

ఇంటింటికీ వెళ్లి..
‘ఎన్టీఆర్ భరోసా’ అందజేసిన ఎమ్మెల్యే మాధవి
నూతన సంవత్సర కానుకగా ముందస్తు పెన్షన్లు
Ntr bharosa | కడప ప్రతినిధి, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ముందస్తు కానుకగా ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేసింది. జనవరి 1 సెలవు దినం కావడంతో 31వ తేదీనే పెన్షన్లు అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు కడప నగరంలోని 22వ డివిజన్ భోల పద్మావతమ్మ వీధిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెన్షన్ నగదును ఎమ్మెల్యే అందజేశారు. ముందుగానే పెన్షన్ అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, 22వ డివిజన్ ఇన్‌చార్జ్ శ్రీనివాసులు, న్యాయవాది గౌతమ్ కిషోర్, 24వ డివిజన్ ఇన్‌చార్జ్ అశోక్ రెడ్డి, నాయకులు జయంత్, గణేష్, చంద్రశేఖర్, రేషన్ డీలర్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.
